![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో ఇప్పుడు థర్డ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ షో మొత్తం ఆది, రాంప్రసాద్ మాత్రమే కనిపించారు. ఇందులో రష్మీ ఒక టాస్క్ ఇచ్చింది కొంతమంది జోడీస్ కి...స్టేజికి లెఫ్ట్, రైట్ సైడ్ కొన్ని యెల్లో లైన్స్ ఇచ్చి ఆ లైన్స్ మీదే నిలబడాలంటూ చెప్పింది రష్మీ. అలా కొన్ని ఎల్లో లైన్స్ మీద పటాస్ ఫైమా, ప్రవీణ్ ఇద్దరూ అతుక్కుని నిలబడ్డారు. ఇక వాళ్ళ వెనకాలకు ఆది వచ్చి నిలబడ్డాడు. "ఇక్కడ ఆగండి...ఇప్పుడు చెప్పండి..అసలు ఏం జరిగింది..ఎందుకు మాట్లాడుకోవట్లేదు" అని అడిగాడు ఆది. "అంటే తనకు నచ్చలేదంతే" అని చెప్పాడు ప్రవీణ్. "ప్రాబ్లమ్ ఏమీ లేదన్నా..మాట్లాడుతున్నా" అని కొంచెం ఇష్టం లేనట్టుగా ఫైమా చెప్పేసరికి మధ్యలో వచ్చింది రష్మీ.."ప్రాబ్లమ్ లేదు, మాట్లాడుతున్నా అంటున్నావ్..అసలు నువ్వు వాడిని ముట్టుకోవడానికే నీ బాడీ షాక్ కొట్టేస్తోంది..." అని రష్మీ అనేసరికి ఫైమా ముఖం తిప్పేసుకుంది. ఫైమా, ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే...
వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ గా మంచి సక్సెస్ సాధించారు. వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఇప్పటిది కాదు పటాస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచీ ఉన్నదే..ఇద్దరూ సరదాగా పెళ్లి ప్రాంక్ వీడియో కూడా చేసి అందరికీ షాకిచ్చారు. వీరి మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని కూడా వీళ్ళే ఆడియన్స్ ముందు చెప్పిన విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఇటీవల కాలంలో బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారు. ఫైమాకి బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం వచ్చేసరికి అందులోకి వెళ్ళింది..ఆ తర్వాత ప్రవీణ్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడా కలిసి కనిపించిన సందర్భాలు లేవు. ఫైమా బిగ్ బాస్ నుంచి వచ్చాక స్టార్ మా ప్రోగ్రామ్స్ లో మాత్రమే తప్ప ఈటీవీ ప్రోగ్రామ్స్ అస్సలు కనిపించడం మానేసింది. చాలా రోజుల తర్వాత థర్డ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ లో ఫైమా ఇలా కనిపించేసరికి ఆది, రష్మీ ఇద్దరూ అసలు విషయం రాబట్టాలనుకున్నారు... కానీ ఫైమా మాత్రం అస్సలు ఒక్క విషయం కూడా బయట పెట్టలేదు.
![]() |
![]() |